రోడ్డు ప్రమాదంలో సీఎం మమతా బెనర్జీ తలకు గాయం..!

Mamata Banerjee’s car meets with accident, suffers minor head injury: Sources

కోల్‌కతాః పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బర్ధమాన్‌ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కోల్‌కతాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పొగమంచు ఎక్కువగా ఉండడంతో సరైన విజిబిలిటీ లేకపోవడంతో కాన్వాయ్‌లోని ముందున్న వాహనానికి సీఎం కూర్చున్న వాహనం దగ్గర వరకు వెళ్లడంతో డ్రైవర్‌ సడెన్‌గా బ్రేకులు వేశాడని తెలిసింది.

దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం తలకు, చేయికి స్వల్ప గాయాలయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో చాపర్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె రోడ్డు మార్గం ద్వారా కోల్‌కతా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది.