కేటీఆర్ పోస్ట్ కు సమంత క్లాప్స్

కేటీఆర్ పోస్ట్ కు సమంత క్లాప్స్

నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న సమంత…మళ్లీ తన దూకుడు పెంచింది. సినిమాల పరంగానే కాక సోషల్ మీడియా లోను అంతే యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటుంది. తన సినిమాల విశేషాలు మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల ఫై , నిర్ణయాల ఫై హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో కేటీఆర్ పోస్ట్ చేసిన పోస్ట్ కు సమంత దండం పెడుతూ చప‍్పట్లు కొడుతూ రిప్లయ్ ఇచ్చింది.

ఆప‌ద‌లో ఉన్న పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇటీవల బాల ర‌క్ష‌క్ వాహ‌నాల‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాకొక‌టి చొప్పున 33 బాల ర‌క్ష‌క్ వాహ‌నాల‌ను ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు చేశారు. సత్యవతి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. మంత్రి సత్యవతి గొప్ప నిర్ణయం తీసుకుందని కొనియాడారు. మంత్రి కేటీఆర్‌ చేసిన ఈ పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టా ప్టోరీలో పెట్టి, దండం పెడుతూ చప‍్పట్లు కొడుతున్న ఎమోజీలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.