ట్రంప్‌పై ముగిసిన అభిశంసన విచారణ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌పై వచ్చిన అవినీతి అభియోగాలతో కొనసాగించిన అభిశంసన విచారణను అమెరికన్ సెనేటర్లు, హౌస్ మేనేజర్లు, ట్రంప్ న్యాయసలహా బృందం బుధవారం ముగించారు. హౌస్ మేనేజర్ల తరపున కాంగ్రెస్ ప్రతినిధి, కొలరాడో డెమొక్రాట్ సభ్యుడు జాసన్ క్రో మీడియాతో మాట్లాడుతూ దుష్ప్రవర్తనకు సంబంధించిన అరుదైన సందర్భాలలో అభిశంసన అన్నది అసాధారణ చికిత్సా పరికరం అవుతుందని అన్నారు. అయితే వైట్‌హౌస్ సలహాదారు పాట్ సిపోలోన్ మాత్రం అధ్యక్షుడ్ని సమర్ధిస్తూ ఒక ఎన్నికల ఫలితాలను తిరగరాసేందుకు, ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేం దుకు డెమొక్రాట్‌లు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇరువర్గాలూ దాదాపు 4 గంటల సేపు సుదీర్ఘ వాద, ప్రతివాదనలు జరిపిన తరువాత తమ వాదనను సమర్ధించుకుంటూ సమానంగా విడి పోయారు. వాద ప్రతివాదనలు ముగిసిన తరువాత సెనేట్ త్వరలో జరుగనున్న సమావేశంలో సెనేటర్లు అభిశంసనపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. ట్రంప్‌పై నమోదయిన అభిశంసన అభియోగాలపై బుధవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) సెనేటర్లు తమ ఓటును వేస్తారని గత వారం ఆమోదించిన తీర్మానం ద్వారా తెలుస్తోంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/