వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కన పెట్టాల్సిందే – ఎమ్మెల్యే సీతక్క

మునుగోడు ఉప ఎన్నిక వేళ ప్రచారానికి రాకపోగా..ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదని , తన తమ్ముడికి ఓటు చేయాలనీ కాంగ్రెస్ కార్య కర్తలను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరడం కార్య కర్తల్లోనే కాదు నేతల్లోను ఆగ్రహం తెప్పిస్తుంది. ఇప్పటికే అధిష్టానం వెంకట్ రెడ్డి కి షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది. వెంకట్ రెడ్డి వ్యవహారం ఫై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుండి పక్కన పెట్టాల్సిందే అన్నారు.

బందాలకతీతమే రాజకీయం…నిబద్దత గల రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ నిబంధనలు,సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి….తమ్ముడి గెలుపే వెంకట్ రెడ్డి కి ముఖ్యమైతే…కాంగ్రెస్ కండువా వదిలేయాలన్నారు. మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది,కాంగ్రెస్ శ్రేణులపై టీఆరెఎస్,బిజెపి నేతలు దాడులకు పాల్పడుతున్నారు…ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియా కు పోవడం ఎంతవరకు కరెక్ట్ ? అని సీతక్క ప్రశ్నించారు.