‘దసరా’మూవీ పబ్లిక్ టాక్..

నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన పక్కా మాస్ మసాలా మూవీ ‘దసరా’. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నటించింది. ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ శ్రీరామ నవమి సందర్బంగా ఈరోజు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు.

నాని కెరీర్ బెస్ట్ పెర్పామెన్స్. దసరా ముందు దసరా తర్వాత అనేంత గొప్పగా నటించారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ర్యాంప్. నాని బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అని కామెంట్స్ వేస్తున్నారు. దసరాలో నాని పెర్ఫామెన్స్ పీక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్‌కి హ్యాట్సాఫ్. అంటూ మరో నెటిజన్స్ కామెంట్స్ చేసారు. ఒకరైతే ఈ దశాబ్దంలోనే బెస్ట్ మూవీ. డైరెక్టర్‌లో అద్భుతమైన స్టఫ్ ఉంది. అయితే సినిమా స్లోగా ఉందే తప్ప.. నాని, కీర్తి నటనతో ది బెస్ట్ అనిపించారని, ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ అని పోస్ట్ పెట్టారు. ఇలా ప్రతి ఒక్కరు సినిమా బ్లాక్ బస్టర్ అని చెపుతున్నారు.