తెలంగాణ లో పదో తరగతి పేపర్ లీక్ ఘటన ఫై ఏపీ మంత్రి బొత్స కామెంట్స్

ap prc-Call for employee unions for negotiations
ap-minister-botsa

తెలంగాణ లో పదో తరగతి పేపర్ లీక్ ఘటన సంచలనం రేపుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈ పేపర్ లీక్ వ్యవహారంలో సూత్రధారి అని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఈ తరుణంలో పేపర్ లీక్ ఘటన ఫై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని దేవుడు కూడా క్షమించడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలనుకోవడం దౌర్భాగ్యం అన్నారు.

ఏపీలో గతేడాది కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలలో పేపర్ లీక్ చేసిన 75 మందిపై చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది పటిష్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే చంద్రబాబు ఫై కూడా ఈ సందర్బంగా బొత్స విమర్శలు చేసారు. ఎంతసేపు సీఎం జగన్ పై నిందలు, విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ,. కొద్దో గొప్పో టిడిపికి ఉన్న ఉనికి వచ్చే ఎన్నికలలో పోవడం ఖాయమని అన్నారు.