ఆమె లేడి విరాట్‌ కోహ్లీ

కితాబిచ్చిన న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్కాట్‌ స్టైరిస్‌

Smriti Mandhana and Virat Kohli
Smriti Mandhana and Virat Kohli

సిడ్నీ: టీమిండియా కెప్టెన్‌, పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లీ తన అద్భుత ఆటతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల సునామీ సృష్టిస్తూ.. దిగ్గజాల రికార్డులు ఒక్కొక్కటిగా కొల్లగొడుతూ వస్తున్నాడు. కోహ్లీని ఇప్పటికే ఎందరో మాజీ దిగ్గజాలతో పోల్చారు. ఇప్పుడు భారత మహిళా జట్టులోకి కీలక క్రీడాకారిణిని కోహ్లీతో పోల్చుతున్నారు. లేడీ ‘విరాట్ కోహ్లీ’ అని అంటున్నారు. ఆమె మరెవరో కాదు ఓపెనర్ స్మృతి మంధాన‌. న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్.. స్మృతి మంధాన‌ను విరాట్ కోహ్లీతో పోల్చాడు. లేడీ ‘విరాట్ కోహ్లీ’ అని కితాబిచ్చేశాడు. ఈ సందర్భంగా స్కాట్ స్టైరిస్ మాట్లాడుతూ… ‘మంధనా మహిళల క్రికెట్‌లో లేడీ విరాట్ కోహ్లీ. గతంలో పురుషుల క్రికెట్‌ను వెస్టిండీస్ దిగ్గజం వీవ్ రిచ‌ర్డ్స్ త‌న అద్భుత ఆట‌తో మ‌లుపుతిప్పాడు. ఇప్పుడు మంధనా అలానే ఆడుతోంది. రిచర్డ్స్ మాదిరిగానే మంధనా గుర్తించబడుతుంది’ అని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/