పటిష్టమైన ఆర్‌సీబి ని చూడలేదు

బౌలింగ్‌ లో లోటు ఉంటుంది… ద్రవిడ్‌

rahul dravid
rahul dravid

ముంబయి: ఐపీఎల్‌లో సీఎస్‌కె, ఆర్‌సీబి లు రెండు కూడా బలమైన జట్లే. కాని సీఎస్‌కె ఇప్పటికే 3సార్లు టైటిల్‌ సాధించగా, ఆర్‌సీబి మాత్రం ఒక్కసారి కూడా టైటిల్‌ ను అందుకోలేకపోయింది. అందుకు గల కారణం ఆర్‌సీబి కి సరైన బౌలింగ్‌ దళం లేకపోవడమే అని భారత మాజీ క్రికెటర్‌ , ఎన్‌సీఎ అధ్యక్షుడు రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపాడు. టిమ్‌ విగ్మోర్‌, ఫ్రెడ్డివైల్డ్‌ రచించిన పుస్తకంలో ద్రవిడ్‌ ఈ విధంగా పేర్కొన్నాడు. ఐపిఎల్‌ లో సీఎస్‌కె బ్యాటింగ్‌ మరియు బౌలింగ్‌ విభాగాలలో సరుయైన క్రీడాకారులను ఎంచుకుంటుందని, కాని ఆర్‌సీబి బౌలింగ్‌ విషయంలో సరియైన క్రాడాకారులను ఎంచుకోలేదని, ఇంత వరకు ఆర్‌సీబిని ఎప్పుడు పటిష్టంగా చూడలేదని అన్నాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/