ఈ నెలలో స్కూల్స్ కు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..?

ఆగస్టు నెల వచ్చింది..మాములుగా నెల మారిందంటే ముందుగా గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయి..బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు..ప్రభుత్వ సెలవులు ఎన్ని అనేది చాలామంది తెలుసుకునే పనిలో ఉంటారు. ఇప్పుడు స్కూల్స్ పిల్లలు , తల్లిదండ్రులు సైతం నెల మారిందంటే ముందుగా స్కూల్స్ కు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో చూస్తున్నారు. ఇక ఈరోజు నుండి ఆగస్టు నెల ప్రారంభం అయ్యింది. గ్యాస్ ధరలు తగ్గి సామాన్య ప్రజలకు ఊరట కలిగించాయి.

ఇక ఈ నెలలో చాలా సెలవులు ఉన్నాయి. రక్షాబంధన్, నాగపంచమి వంటి అనేక పండుగలు వస్తున్నాయి. స్కూల్స్ కు ఏ ఏ రోజు సెలవులు వచ్చాయో చూస్తే..

ఆగస్ట్ 8, 2023న అంటే మంగళవారం.. ఈ రోజున టెండోంగ్ లో రమ్ ఫీట్ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. ఈ పండుగను సిక్కింలో జరుపుకుంటారు. ఈ సమయంలో స్థానిక ప్రభుత్వం ఇక్కడ సెలవు ప్రకటించింది.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని 9 ఆగస్టు 2023న జరుపుకుంటారు. ఈ సందర్భంగా గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీనికి సంబంధించి.. జార్ఖండ్ ప్రభుత్వం ఆగస్టు 9 న పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

ఆగస్టు 12 రెండో శనివారం సందర్భంగా ఈ రోజు కూడా పాఠశాలలకు సెలవు ఉంటుంది. వారపు సెలవుదినం 13 ఆగస్టు 2023న వస్తుంది. అందుకే ఆగస్టు 13న కూడా పాఠశాలలకు సెలవు.

15 ఆగస్టు 2023న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. పార్సీ నూతన సంవత్సరం 16 ఆగస్టు 2023న అనేక రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఈ సందర్భంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి.

20 ఆగస్టు 2023న ఆదివారం కూడా వారపు సెలవుదినం. దీంతో పాఠశాలలకు సెలవులు ఉంటాయి. ఆగస్టు 21న నాగపంచమి పండుగ. ఈ రోజున దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేయబడతాయి.

28 ఆగస్టు 2023 సోమవారం. ఈ రోజున కేరళలో ఓనం (ఓనం పండుగ) జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇక్కడి పాఠశాలలకు సెలవు.

2023 ఆగస్టు 29న తిరువోణం పండుగను కేరళ రాష్ట్రంలో మాత్రమే జరుపుకుంటారు. సో అక్కడ సెలవు.

ఆగస్టు 30 రక్షా బంధన్ పండుగ. ఈ పండుగను భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. అయితే తెలంగాణలో ఆగస్టు 29, 30వ తేదీన గ్రూప్ 2 పరీక్ష నేపథ్యంలో ఈ రెండు రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఇవి కాకుండా అతి భారీ వర్షాలు వస్తే స్కూల్స్ కు సెలవు ప్రకటిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు. గత నెలలో అయితే తెలంగాణ లో దాదాపు ఐదు రోజుల వరకు సెలవులు వచ్చాయి.