నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది జైలుశిక్ష

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 30 ఏళ్ల క్రితం నాటి కేసులో సిద్ధూకు అత్యున్నత న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. 1988, డిసెంబర్ 27న రోడ్డుపై సిద్ధూకు, గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిని సిద్ధూ క్షణికావేశంలో తలపై కొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పును గురువారం వెల్లడించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/