కూనో పార్క్‌లో చీతాలు మృతి..సుప్రీంకోర్టులో విచార‌ణ

SC highlights ‘public concern’ about cheetah deaths, but leaves their welfare to experts

న్యూఢిల్లీ: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కూనో జాతీయ పార్క్‌లో చీతాలు వ‌రుస‌గా మృతి చెందుతున్న విష‌యం తెలిసిందే. ఈ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. చీతాల మ‌ర‌ణాల‌ సంఖ్య‌ను మ‌రీ త‌క్కువే అని కొట్టిపారేయ‌లేమ‌ని కోర్టు తెలిపింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, పీఎస్ న‌ర్సింహా, ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది. ఇటీవ‌ల కూనో పార్క్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై సాధార‌ణ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్న‌ట్లు జ‌స్టిస్ గ‌వాయి నేతృత్వంలోని క‌మిటీ పేర్కొన్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ పార్కులో 9 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి.

కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఐశ్వ‌ర్య భాటి వాదించారు. ట్రాన్స్‌లొకేష‌న్ ప్రాజెక్టు చాలా విశిష్ట‌మైంద‌ని, ఇప్పుడంత ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఐశ్వ‌ర్య క్లారిటీ ఇచ్చారు. చీతాల మృతిపై మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల‌ను న‌మ్మ‌వ‌ద్దు అన్నారు. చీతాల మృతిని అడ్డుకోవాల‌ని, ఇదే చాలా కీల‌క‌మైంద‌ని జ‌స్టిస్ న‌ర్సింహ చెప్పారు. ఈ కేసును విచార‌ణ కోసం వాయిదా వేశారు. న‌మీబియా, సౌతాఫ్రికా నుంచి వ‌చ్చిన చీతాల‌ను ఎందుకు కేవ‌లం కూనో పార్క్‌కు మాత్ర‌మే పంపార‌ని కోర్టు ప్ర‌శ్నించింది. అవ‌స‌ర‌మైతే కొన్ని చీతాల‌ను రాజ‌స్థాన్‌కు పంపాల‌ని కూడా కోర్టు సూచించింది.