టూరిస్ట్‌ వీసాల గడువును పెంచిన సౌదీ

మ‌రో మూడు నెల‌ల పాటు వీసాల‌ గ‌డువు పెంపు..సౌదీ ప్రభుత్వం

saudi arabia
saudi arabia

రియాధ్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా టూరిస్ట్ వీసాల‌పై సౌదీ అరేబియా వెళ్లి చిక్కుకుపోయిన వారికి ఆ దేశ ప్రభుత్వం తీపిక‌బురు అందించింది. లాక్‌డౌన్ వ‌ల్ల సౌదీలో ఉండిపోవ‌డంతో వీసా గ‌డువు ముగిసిన వారికి ఎలాంటి అద‌న‌పు రుసుము చెల్లించ‌కుండానే మ‌రో మూడు నెల‌ల పాటు వీసాల‌ గ‌డువు పొడిగిస్తున్న‌ట్లు సౌదీ తాజాగా వెల్లడించింది. ఈ మేర‌కు పాస్‌పోర్ట్ జనరల్ డైరెక్టరేట్(జ‌వాజ‌త్‌) మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీని కోసం వీసాదారులు పాస్‌పోర్ట్ డైరెక్ట‌రేట్ల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేద‌ని, ఆటోమెటిక్‌గానే ఈ పొడిగింపు యాడ్ అవుతుంద‌ని తెలిపింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/