చైనా పర్యటనకు పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ

Mohammad Qureshi
Mohammad Qureshi, pakistan external affairs minister

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మఖ్దూమ్ షా మహమూద్ ఖురేషీ చైనా పర్యటనకు గురువారం బయల్దేరారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఖురేషి సమావేశమవుతారు. బెల్ట్ అండ్ రోడ్డ్ ప్రాజెక్టు, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంశాలతోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ ఏడాది జరుపనున్న పాకిస్థాన్ పర్యటనపై వారు చర్చించనున్నట్లు సమాచారం. కశ్మీర్‌పై చైనా మద్దతులోపాటు భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతపైనా ఖురేషి చర్చిస్తారని తెలుస్తున్నది. సౌదీ అరేబియాతో విభేదం నేపథ్యంలో ఖురేషి చైనా పర్యాటన ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి సోహైల్ మహమూద్‌తో పాటు పలువురు దౌత్య ప్రతినిధులు ఆయన వెంట వెళ్లనున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/