నేడు సిఎం కెసిఆర్‌ నియంత్రిత సాగుపై సమీక్ష

కరోనా , రాష్ట్ర అవతరణ వేడుకలపైనా కూడా చర్చ

నేడు సిఎం కెసిఆర్‌ నియంత్రిత సాగుపై సమీక్ష
cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు రాష్ట్రంలో నియంత్రిత పంటలసాగు కోసం రైతులను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నియంత్రిత సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ, లాక్‌డౌన్‌ సడలింపులు, తెలంగాణ అవతరణ వేడుకలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో వివిధశాఖల అధికారులతో సిఎం సమావేశమవుతారు. ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేస్తామని రాష్ట్రంలో ఇప్పటికే అనేకచోట్ల గ్రామాలకు గ్రామాలే మూకుమ్మడిగా తీర్మానాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను మరింత ప్రోత్సహించేలా ఏంచేయాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/