‘ప్రేమాత్మ స్వరూపులారా’!

ఆధ్యాత్మిక చింతన-సత్యసాయి ప్రబోధాలు

Sathya sai baba
Sathya sai baba

సత్య, ధర్మ, శాంతి, ప్రేమలకు అనుగుణంగా మానవులు అందరూ ఇతరుల సేవలో పాల్గొనాలని, ప్రతీ ఒక్కరిలో సేవ భావం అనే సుగుణం ఉండాలని భగవాన్‌ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా తెలిపారు.

ప్రేమ అనేది హృదయంలో నుండి ఉద్భవించాలని ప్రేమ ప్రేమలో జీవిస్తుంది. అంటూ ‘ప్రేమాత్మ స్వరూపులారా! అని సత్యసాయిబాబా ప్రతీ ప్రసంగంలో భక్తలను ఉద్దేశించి ప్రసంగించడలోనే గొప్ప సందేశం కలిగి ఉండడం విశేషం.

అందరిలోనూ భగవానుడు వున్నాడని కనుక మానవ సేవయే మాధవ సేవగా ప్రతీ ఒక్కరూ భావించాలని బాబా ఉద్భోధించారు.

మానవుడు స్వార్థం అనేది వదిలి పెట్టాలని, నిస్వార్థంతో చేసే పని ఏదైనా సరే సార్థకత కలిగి ఉంటుంది. అని బాబా పేర్కొంటారు.

నేటి సమాజంలో యువత కర్తవ్యం. దీక్ష, పట్టుదల కలిగి ఉండాలని కోరారు. యువత సేవల వైపు తమ దృష్టి పెట్టాలని కోరారు.

బాబా తన సందేశంలో గ్రామ సేవ గురించి కూడా చెప్పడం విశేషం. గ్రామసేవ ద్వారా ఆయా గ్రామాలలో చైతన్యవం తమైన కార్యక్రమాలు జరపాలని సూచిం చారు.

ప్రతీ ఒక్కరూ అహం వీడాలని అందరూ ఒక్కటేనన్న భావంతో ఉండాలన్నారు.

నా జీవితమే ఒక సందేశం ప్రేమతో ఒక్కరూ అహం వీడాలని అందరూ ఒక్కటేనన్న భావంతో ఉండాలన్నారు.

నా జీవితమే సందేశం ప్రేమతో ఉండండి. ప్రేమతో జీవించండి అంటూ ప్రేమ యొక్క విలువలను కాపాడాలి అని బోధించారు.

సత్యసాయి బాబా! పిల్లలు చిన్ననాటి నుండే ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుండే మంచి అలవాట్లు నేర్పించాలని బాబాతన ప్రసంగలో కోరారు.

సత్యసాయి సేవాసంస్థలు బాలవికాస్‌ ద్వారా బాల,బాలికలకు, చక్కని విద్యా బోధనలు చేయించడం జరుగుతోందని, మన భారతీయ సంస్కృతిని అందరూ కాపాడాలని బాబా తన దేశంలో అప్పట్లో ఉద్భోదించారు.

ప్రస్తుతం శ్రీ సత్యసాయిసేవా సంస్థలు సేవలు విశ్వ వ్యాప్తంగా విస్తరించాయి. వీటిలో విద్యా, వైద్యం, ఆధ్యాత్మికత ఆకలిగొన్న వారికి అన్నదాని వంటి సేవలు వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సేవలు ఇప్పటికీ జరుగుతుండడం గొప్ప విశేషం.

మానవులు అందరూ సత్యం, ధర్మం, శాంతి ప్రేమలతో నడుచుకోవాలని బాబా తెలిపారు.

ప్రతీ ఏడాది శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయిబాబా జన్మదిన శుభదినం సందర్భంగా ప్రతీ ఏటా నవంబర్‌ 23వతేది శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు అత్యంత వైభంగా జరుగుతాయి.

అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈ వేడుకలు జరుపబడడం విశేషం ఇప్పటికీ ఈ ప్రాంతంలో ప్రశాంతం కల వాతావరణం ఉండడం గమనార్హం.

అయితే కోవిడ్‌ నిబంధనలు అను సరించి ఈ ఏడాది సత్యసాయి జన్మదిన వేడుకలు అతి నిరాడంబరంగా నిర్వహిచారు.

ఏది ఏమైనా అందరికీ ఆదర్శం కల బోధనలు శ్రీ సత్యసాయి బాబా సంద ేశాలు. మనం ఏ నాటికి మరువలేము.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/