వేచి ఉండటం ఉత్తమం

బైబుల్ కథలు

Jesus
Jesus

మనం మన శక్తిని ఆధారం చేసుకుని చాలాసార్లు పనులు చేస్తుంటాం. దేవ్ఞడు అది వద్దని చెబుతున్నా దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతాం. తద్వారా గొప్పనష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అబ్రాహాముకు దేవ్ఞడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు.

కానీ అతడు విశ్వాసం అయితే ఉంచాడు కానీ, దేవ్ఞడు అనుగ్రహించే సమయం వరకు వేచివ్ఞండలేకపోయాడు. అలాగే తన భార్య అయిన శారా మాటలకు విలువనిచ్చాడు. దేవుడి మాట వినకుండా భార్య మాట విన్నాడు. ఐగుప్తు నుంచి వచ్చిన దాసులు, దాసీలతో పాటు హాగరు అనే దాసికూడా వచ్చింది.

శారా ఆమె ద్వారా సంతానాన్ని కనమని అబ్రాహాముకు చెప్పినప్పుడు అతడు ఆమె మాటను బట్టి హాగరు ద్వారా సంతానాన్ని కన్నాడు.

అతడి పేరు ఇష్మాయేలు. ఇతడు ఒక జాతికి నాయకుడిగా అయ్యాడు. అనంతరం దేవ్ఞడు అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడిని ఇచ్చాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అయితే ఇష్మాయేలు శరీరసంబంధంగా జన్మించాడు.

తద్వారా ఈ రెండు జాతుల మధ్య పోరాటం కొనసాగుతూనే వ్ఞంది. మోషే దేవ్ఞడు చెప్పిన మాటకు విధేయుడు కాకుండా తన ఇష్టప్రకారం చేశాడు.

దేవ్ఞడు మోషేతో బండతో మాట్లాడమని చెబితే, మోషే బండతో మాట్లాడేందుకు బదులుగా దాన్ని కొట్టాడు. మొదటిసారి ఇశ్రాయేలీయులు దాహం కోసం అల్లాడుతున్నప్పుడు మోషే దేవ్ఞడికి ప్రార్థన చేశాడు.

అప్పుడు దేవ్ఞడు మోషేతో బండను కొట్టమన్నాడు. దీంతో మోషే బండను కొట్టినప్పుడు నీళ్లు వచ్చాయి. రెండవ సందర్భంలో కూడా మోషే దేవ్ఞడికి నీళ్లకోసం ప్రార్థన చేసినప్పుడు దేవ్ఞడు బండతో మాట్లాడమన్నాడు. అయితే మోషే మొదటి బండను కొట్టినట్లుగానే రెండవసారి కూడా బండను కొట్టాడు.

తద్వారా దేవ్ఞడి మాటకు అవిధేయుడై, కనాను దేశంలో ప్రవేశించలేకపోయాడు. ‘నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి విూరు తోడుకొని పోరని చెప్పెను (సంఖ్యా 20:12). దేవ్ఞడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతాడు. ఆయన పక్షపాతికాడు.

మనం ఏదైనా చేసేముందుకు దేవ్ఞడి చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయన చెప్పింది చేయాలే తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకుని, ముందుకు వెళ్తే నష్టమే తప్ప లాభం వ్ఞండదు. తొందరపడితే తర్వాత బాధపడేదానికంటే ముందే కాస్త ఓర్పు, సహనంతో వేచి వ్ఞండడం మంచిది.

  • పి.వాణీపుష్ప

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/