‘ఈ పుట్టుక నాది.. బ్రతుకంతా మీది..’ అంటూ కేసీఆర్ ఫై తన ప్రేమను చాటుకున్న జోగినిపల్లి

‘ఈ పుట్టుక నాది.. బ్రతుకంతా మీది..’ అంటూ కేసీఆర్ ఫై తన ప్రేమను చాటుకున్న జోగినిపల్లి

జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలియని వారుండరు. తెలంగాణ ముఖ్యమంత్రి , తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నమ్మిన బంటు..టిఆర్ఎస్ పార్టీ పురుడుపోసుకున్న 2001 సంవత్సరం నుంచి కేసీఆర్ వెంట నడుస్తూ వస్తున్నాడు. అలాంటి వ్యక్తి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా ట్విట‌ర్ వేదిక‌గా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంతోష్ కుమార్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

గ్రీన్ స్టార్ సంత‌న్న అని కొనియాడారు. కేసీఆర్‌కు అత్యంత ఆత్మీయుడు, భ‌విష్య‌త్ నాయ‌కుడు కేటీఆర్‌కు ప్రియ‌మైన సోద‌రుడు, పచ్చని ప్రకృతి ప్రేమికుడు.. పక్షులకు ఇష్టమైన స్నేహితుడు.. అంటూ త‌మ ట్వీట్ల‌లో అభిమానులు పేర్కొన్నారు. అయితే సంతోష్ మాత్రం పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ అరుదైన చిత్రాన్ని ట్వీట్ చేశారు. ఈ పుట్టుక నాది.. బ్ర‌తుకంతా మీది.. అని రాశారు. అయితే కేసీఆర్ సంతోష్ కుమార్‌ను భుజాల‌పై ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>“ఈ పుట్టుక నాది …..<br> బ్రతుకంతా మీది ……” <a href=”https://t.co/LHzUit0jLi”>pic.twitter.com/LHzUit0jLi</a></p>&mdash; Santosh Kumar J (@MPsantoshtrs) <a href=”https://twitter.com/MPsantoshtrs/status/1468159905634807810?ref_src=twsrc%5Etfw”>December 7, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>