కేసీఆర్ సమావేశంలో భట్టి విక్రమార్క..

దళిత బంధు పథకం అమలుపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఏర్పటు చేసారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం లో కూడా దళిత బంధు అమలు చేస్తున్నారని దాంతో స్థానిక ఎమ్మెల్యే అయిన భట్టి ని కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు చేయనున్నారు.

ఇందులో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చారగొండలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం సమావేశం ఏర్పటు చేసారు. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ హాజరయ్యారు.