రోడ్లు వేయడం రాదుకానీ.. రోడ్లను తవ్వేసి బ్యారికేడ్లు మాత్రం వేయిస్తున్నారుః

nadendla-manohar-satires-on-jagan-during-his-visit-to-kuppam

అమరావతిః సిఎం జగన్‌ ఈరోజు కుప్పంలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు బదిలీ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. మరోవైపు, సీఎం పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా చర్యలు చేపట్టారు. పట్టణంలోని రోడ్లలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి నేత నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ఒక్క బటన్ నొక్కడానికి మూడు వరుసల బ్యారికేడ్లు అవసరమా? అని ఎద్దేవా చేశారు. మూడు వేల మంది పోలీసులు, మూడు వేల బస్సులు ఉండాలా ముఖ్యమంత్రి గారూ? అని ప్రశ్నించారు. మీకు రోడ్లు వేయడం రాదుకానీ… రోడ్లు తవ్వేసి బ్యారికేడ్లు మాత్రం వేయిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్న ఫొటోను షేర్ చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/