నిరాశ పరిచిన సానియా జోడి

ఖతర్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించిన టెన్నిస్‌ స్టార్‌

Sania Mirza
Sania Mirza

దోహా: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఖతర్‌ ఓపెన్‌లో నుంచి నిష్క్రమించింది. మహిళల డబుల్స్‌లో ఫ్రెంచ్‌ క్రీడా కారిణి కరోలిన్‌ గార్సియా జోడిగా బరిలోకి దిగిన సానియా తొలి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది. లారా(జర్మనీ), కాగ్లా(టర్కీ) జంట చేతిలో ఓడిపోయింది సానియా జోడి. వరుస సెట్లలో పరాజయాన్ని చవిచూసిన సానియా జోడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత రాకెట్‌ పట్టిన సానియా ఇటీవలే హోబర్ట్‌ అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే కరోలినాతో కలిసి రంగంలో దిగిన దుబాయ్ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో మాత్రం ఈ జోడి నిరాశ పరిచింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/