తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని మారదు

రైతుల మద్దతుతో పెట్టిన రాజధాని అమరావతి

somireddy chandramohan reddy
somireddy chandramohan reddy

అమరావతి: తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని మారదని..అడ్డగోలుగా తీసుకెళ్లినా..మళ్లీ వెనక్కి వస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. నేడు రాజధాని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ..రైతుల మద్దతుతో పెట్టిన రాజధాని అమరావతి అని పేర్కొన్నారు. పార్టీ, కులం, పేరు చెప్పి వైఎస్‌ఆర్‌సిపి అసత్య ప్రచారం చేస్తోందన్నారు. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మంత్రులకు కన్పించడం లేదా? అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/