సంగారెడ్డిలో ఘోరం..కూతురుపై కన్న తండ్రి లైంగిక దాడి

రోజు రోజుకు సమాజం దారుణంగా తయారవుతుంది. కామంతో వావివరుసలు మరచిపోయి ప్రవర్తిస్తూ తలదించుకునేలా చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల దగ్గరి నుండి ఆఖరికి కన్నా కూతురి ఫై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే వెలుగులోకి రాగ..తాజాగా సంగారెడ్డి లో కూడా ఇదే జరిగింది. 11 ఏళ్ల కూతురి ఫై కన్న తండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు.

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ నివసిస్తుంటాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో 11 ఏళ్ల కన్న కూతురుపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు తండ్రిని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. అమీన్పూర్ పోలీసులు సోమవారం రోజున అతనిపై పోస్కో, రేప్ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. అటు బాలికలను భరోసా సెంటర్ కి తరలించారు.