పొంగులేటిపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఫైర్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గత కొద్దీ నెలలుగా బిఆర్ఎస్ కు , కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ..విమర్శలు చేస్తుండడం తో పొంగులేటి ని రీసెంట్ గా అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ తరుణంలో పొంగులేటి మరింత దూకుడు పెంచడం తో..ఆయన దూకుడికి తగ్గట్లే ఖమ్మం బిఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఖమ్మం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్..పొంగులేటి ఫై ఫైర్ అవ్వగా..తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఏ ఒక్క అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ..ప్రజల కోసం పొంగులేటి చేసిన మంచి పనులేమున్నాయని ప్రశ్నించారు. తాము మంచి పనులు చేశాం కాబట్టే ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నామని అన్నారు. చౌకబారు విమర్శలు చేసే పొంగులేటి వంటి వ్యక్తులను ప్రజలు నమ్మరని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నీవు టార్గెట్ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని సండ్ర అన్నారు. రెండు జాతీయ పార్టీలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయని పొంగులేటి చెపుతున్నారని… ఆయనే జాతీయ పార్టీల నాయకుల వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. పొంగులేటి వంటి నాయకులతో పార్టీలు నాశనం అవుతాయని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు మీ పరిస్థితి ఏమిటో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు.