కరోనా పై పోరుకు భారీ విరాళాన్ని ప్రకటించిన శాంసంగ్‌

తన వంతుగా రూ 20 కోట్లు ప్రకటన

samsung
samsung

దిల్లీ: భారత్‌లో కరోనా పై పోరుకు శాంసంగ్‌ భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనాపై పోరుకు తన వంతుగా రూ.20 కోట్లు ప్రకటించింది. ఇందులొ రూ.15 కోట్లు పిఎం కేర్స్‌ ఫండ్‌కు కేటాయించగా.. తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు రూ.5 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా సంస్థ ఉద్యోగులు కూడా దేశ వ్యాప్తంగా విరాళాలు అందిస్తున్నారని, మున్ముందు తమ ఉద్యొగుల విరాళాల మొత్తానికి సమాన మొత్తాన్ని కలిపి పిఎం కేర్స్‌ ఫండ్‌కు అందిస్తామని తెలిపింది. ఈ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. అగ్రగామి సంస్థలు కూడా కరోనా పై పోరాటంలో ముందుకు వస్తున్నాయని, ఇది మంచి నిర్ణయమని ప్రశంశించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/