మునుగోడు విజయంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీకి భారీ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. టిఆర్ఎస్ పార్టీ విజయం పట్ల తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశం ఏర్పటు చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని.. దానికి నిదర్శనమే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం అన్నారు.

2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో వరుసగా టీఆర్ ఎస్ విజయం సాధించిందన్నారు. తమ పార్టీ విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీకి మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఓటమిని హుందాగా అంగీకరించాలన్నారు. తాము గతంలో హుజురాబాద్, దుబ్బాకలో ఓడిపోయినప్పుడు తాము ఓటమిని హుందాగా అంగీకరించామన్నారు. ఓటమి చెందినంత మాత్రన నిందలు వేయడం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.

అహంకారం, డప్పు మదం, రాజకీయ కళ్లునెత్తికెక్కి, పొరుగుతో బలవంతుపు ఉప ఎన్నిక ఉప ఎన్నికను తెలంగాణ, మునుగోడు ప్రజలపై రుద్దింది ఢిల్లీ బాస్‌లు మోడీ, అమిత్‌షా. ఇద్దరి అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి ధన్యవాదాలు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగుర వేసినందుకు సంతోషపడుతున్నం. రుద్దిన ఎన్నికను.. రుద్దిన వారికే మీరు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చింది. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన మొఖం బిజెపి నుంచి రాజగోపాల్‌రెడ్డిదే కావొచ్చు. వెనుకుండి నాటకం మొత్తం నడిపింది అమిత్‌ షా, మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు’ అన్నారు.

నిజానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఇంకా మెజారిటీ రావాల్సి ఉండే. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అలాంటిది. కానీ, బీజేపీ ఢిల్లీ, గల్లీ నాయకత్వం.. మాకున్న సమాచారం ప్రకారం.. మొట్టమొదటి సారిగా ఢిల్లీ నుంచి డబ్బుల సంచులు వందల కోట్ల రూపాయలను తరలించారు. అభ్యర్థిని అడ్డదారుల్లో గెలిపించేందుకు డబ్బు, మద్యం, అధికార మదంతో కొనిపారేయాలని మునుగోడు ఓటరును అని.. అసాధారణ పరిస్థితిని సృష్టించి.. ఎన్నికను డబ్బు మయం, ధనమయం చేసి జనాన్ని, జనం గొంతు నొక్కాలనే ప్రయత్నం బీజేపీ చేసిందన్నారు.