సమంత జాయిన్ కావడం తో ‘ఖుషి’ టీం ఫుల్ ‘ఖుషి ‘

గత కొద్దీ రోజులుగా సమంత ఓ ప్రమాదకరమైన వ్యాధికి గురి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఈమె ఒప్పుకున్నా సినిమాలన్నిటికీ బ్రేక్ పడింది. వాటిలో ఖుషి మూవీ కూడా ఒకటి. శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ – సమంత జంటగా ఖుషి చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లిన కొద్దీ రోజులకే సమంత అనారోగ్యానికి గురికావడం తో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. సమంత ఎప్పుడు జాయిన్ అవుతుందో..ఎప్పుడు మళ్లీ సినిమా ను స్టార్ట్ చేస్తారో అని అంత అనుకుంటున్నా సమయంలో సామ్..మళ్లీ షూటింగ్ లో జాయిన్ కావడం తో సినిమా యూనిట్ అంత ఖుషి అవుతున్నారు.

నిన్న ఉమెన్స్ డే సందర్బంగా సెట్ లో సమంత కేక్ కట్ చేస్తున్న పిక్ ను సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. చిత్ర యూనిట్ మొత్తం ఆమెని అభినందిస్తూ ఉన్నట్లు ఆ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. సమంతకి విమెన్స్ డే విషెస్ చెబుతూ ఈ ఫోటోని వారు షేర్ చేశారు. దీంతో ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు కూడా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి సామ్ మళ్లీ సెట్స్ లోకి అడుగుపెట్టడం తో యూనిట్ సభ్యులతో పాటు సినిమా నటి నటులు ఫుల్ ఖుషి చేసుకుంటున్నారు. రొమాంటిక్ లవ్ స్టొరీగా ఈ సినిమాని దర్శకుడు శివ నిర్వాణ ఆవిష్కరిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లోనే ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.