సమంత హాస్పటల్ లో చేరడం ఫై క్లారిటీ ఇచ్చిన మేనేజర్

క్రేజీ బ్యూటీ సమంత గత కొద్దీ రోజులుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ ప్రకటన చేసినప్పటి నుండి సమంత త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ తమిళ మీడియాలో పుకార్లు వైరల్ గా మారాయి. సమంత ఆస్పత్రిలో చేరినట్లు తమిళ్ మీడియా లో బ్రేకింగ్‌ వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ వదంతులేనని కొట్టి పారేశారు సమంత కుటుంబ సభ్యులు. ఆమె ఇంట్లోనే క్షేమంగా ఉందంటూ స్పష్టం చేశారు. మరోవైపు సమంత ఆరోగ్యంపై వస్తోన్న ఫేక్‌ న్యూస్‌ని నమ్మోద్దని ఆమె మేనేజర్‌ కోరాడు.

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మొదటి ఆట తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు , అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. సినిమా విజయం పట్ల సమంత సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపింది.