నేడు హైదరాబాద్ లో 36 ఎంఎంటీఎస్ సర్వీసులు ర‌ద్దు

హైదరాబాద్: హైదరాబాద్ లో నేడు ఎంఎంటీఎస్ సేవ‌లు పాక్షికంగా ర‌ద్ద‌య్యాయి. అయితే సేవ‌ల్లో అంత‌రాయం కేవ‌లం ఈ ఒక్క రోజు మాత్ర‌మే ఉండ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. సాంకేతిక కార‌ణాలు, ట్రాక్ మ‌ర‌మ్మ‌త్తులు ఉన్న నేప‌థ్యంలో మొత్తం 36 స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇక కేవ‌లం ఎంఎంటీఎస్ సేవ‌లు మాత్ర‌మే కాకుండా విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలును సైతం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/