చరణ్ మరదలి పెళ్లి లో సమంత సందడి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరదలు, ఉపాపన ముద్దుల చెల్లెలు అనుష్పాల పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఆమె ప్రియుడితో డిసెంబర్ 8న ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ , రాజకీయ ప్రముఖులు సైతం హాజరై సందడి చేసారు. ముఖ్యంగా ఈ వేడుకలో సమంత ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. విడాకుల తర్వాత బయట ఫంక్షన్లకు దూరంగా ఉంటున్న సామ్..ఫస్ట్ టైం ఈ వివాహం లో కనిపించి ఆకట్టుకుంది.

సమంత , ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామ్ చరణ్ కు , ఉపాసనకు సామ్ మంచి స్నేహితురాలు.. ఇక ఉపాసన, సామ్ స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో చెల్లి వివాహానికి స్పెషల్ గెస్ట్ ల లిస్ట్ లో సామ్ ని ఆహ్వానించింది ఉపాసన. పెళ్ళిలో రామ్ చరణ్, ఉపాసన, శిల్పా రెడ్డితో సామ్ సందడి చేసింది.