అఖండ నైజాం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..

Akhanda movie-Box office records breaking
Akhanda movie-Box office records breaking

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుంది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీగా గత వారం భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం రికార్డ్స్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటీకే పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన బాలయ్య.. నైజాంలో వారం రోజుల్లో 14.8 కోట్ల షేర్ ను రాబట్టింది. తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ‘అఖండ’ మూవీ మొదటి వారం మొత్తం సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగించింది. తొలి ఆరు రోజులతో పోల్చితే వారాంతంలో కాస్త డ్రాప్ కనిపించింది.

ఈ వారం రోజుల్లో రోజువారీ కలెక్షన్స్ చూస్తే..

మొదటి రోజు – 15.39 కోట్లు
రెండో రోజు – 6.83 కోట్లు
మూడో రోజు – 7.03 కోట్లు
నాల్గో రోజు – 8.31 కోట్లు
ఐదో రోజు – 3.58 కోట్లు
ఆరో రోజు – 2.53 కోట్లు
ఏడో రోజు – 1.44 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 45.11 కోట్లు (71.30 కోట్ల గ్రాస్ )