సల్మాన్‌ఖాన్‌ కోసం 600 కి.మీ సైకిల్‌ పై సాహసం

అస్సాంలోని గౌహతిలో 15న ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం..ఆ ప్రోగ్రామ్ కు వస్తున్న సల్మాన్ ను కలిసేందుకు అభిమాని ప్రయత్నం

Fan-Salman-Khan
Fan-Salman-Khan

ముంబయి: తన అభిమాన నటుడు సల్మాన్‌ఖాన్‌ ని నేరుగా చూసేందుకు 52 ఏళ్ల వయసున్న భూపేన్ లిక్సన్ 600 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కాడు. అస్సాంలోని జగున్ గ్రామం నుంచి ఫిబ్రవరి 8న సైకిల్ తొక్కడం మొదలుపెట్టి 13వ తేదీన ఆ రాష్ట్రంలోని పెద్ద పట్టణం గౌహతికి చేరుకున్నాడు. తాను సైకిల్ తొక్కుతున్న, సల్మాన్ సైకిల్ తొక్కుతున్న ఫొటోలను ప్రింట్ చేసిన ఓ పోస్టర్ ను సైకిల్ కు పెట్టుకుని తన అభిమానాన్ని చాటాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా అస్సాంలోని గౌహతిలో ఈ నెల 15న ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. సల్మాన్ ఖాన్ ఆ ప్రోగ్రాంలో పాల్గొననున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భూపేన్.. తమ గ్రామం నుంచి సైకిల్ పై గౌహతికి బయలుదేరాడు. ఐదు రోజుల్లోనే 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి.. 13న సాయంత్రం గౌహతికి చేరుకున్నాడు. భూపేన్ యుక్త వయసులో ఉన్నప్పుడు అస్సాంలో సైక్లింగ్ చాంపియన్. తన పేరిట కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి. అయితే 52 ఏళ్ల వయసులో ఏకంగా 600 కిలోమీటర్లుపైగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం ఆసక్తిగా మారింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/