భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట విషాదం

భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ (74) గురువారం కన్నుమూశారు. ఇటీవల నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స కూడా అందించారు. కానీ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగవకపోవడంతో కొన్ని రోజుల క్రితం సొంతూరు మాలిక్ చౌక్‌కి తరలించారు. అక్కడ ఈరోజు తిలక్ యాదవ్ తుది శ్వాస విడిచారు. ఉమేష్ యాదవ్‌ తండ్రి తిలక్‌ యాదవ్‌ మరణించడంపై ఆయన కుటుంబ సభ్యులు, టీమిండియా ప్లేయర్లు సంతాపం తెలుపుతున్నారు.

ఇక ఉమేష్ యాదవ్ విషయానికి వస్తే..2010లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉమేశ్ యాదవ్.. గత కొన్ని రోజులుగా కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. కానీ.. టెస్టుల్లోనూ తుది జట్టులో ఈ ఫాస్ట్ బౌలర్‌కి అవకాశాలు దక్కడం లేదు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఉమేశ్ యాదవ్ మ్యాచ్‌లు ఆడబోతున్నాడు.