మంటగలుస్తున్న మానవ సంబంధాలు..

సొంత చెల్లిపైనే సోదరుడి అఘాయిత్యాం

brother-rape-on-his-own-sister
brother-rape-on-his-own-sister

పాల్వంచ: భద్రాది కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘోరం జరిగింది. సోదరుడే అత్యాచారం చేయడంతో మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పాల్వంచ జ్యోతినగర్‌కు చెందిన యువతికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన ఓ యువతిని ఆమె తల్లిదండ్రులు బంధువుల వివాహ వేడుకకు వెళ్తూ పాతపాల్వంచలోని అన్నయ్య రాంబాబు ఇంటివద్ద వదిలి వెళ్లారు. అయితే యువతి అన్నయ్య రాంబాబు ఆమెను జ్యోతినగర్‌లో తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్లాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అన్నయ్యే కీచకుడిగా మారి సొంత చెల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. తండ్రిగా అన్నివిషయాల్లో అండగా ఉంటాడనుకున్న అన్నయ్య అకృత్యానికి పాల్పడడంతో తీవ్ర ఆవేదన చెందింది. అనంతరం యువతి అవమానభారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఆ యువతి రోడ్డుపైకి రావడంతో గమనించిన స్థానికులు పాల్వంచలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/