టెలివిజన్ సీరియల్స్ షూటింగ్ లకు కర్నాటక సర్కార్ పచ్చజెండా

కరోనా కేసులు లేని ప్రాంతాల్లో మాత్రమే అనుమతి

Television Serials Shooting
Television Serials Shooting

Bangalore: టెలివిజన్ సీరియల్స్ షూటింగ్ లకు కర్నాటక సర్కార్ పచ్చజెండా ఊపింది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల   ఇచ్చిన కొన్ని సడలింపుల  నేపథ్యంలో కన్నడ టెలివిజన్ సంఘం అధ్యక్షుడు , సీఎం యడియూరప్పను కలిసి షూటింగ్ లకు అనుమతి కోరారు.

సినీ కార్మికులు షూటింగ్ లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ  ఆయన సీఎంకు వివరించారు.

దీంతో సానుకూలంగా స్పందించిన యడియూరప్ప కొన్ని నిబంధనలకు లోబడి టెలివిజన్ షూటింగ్ లకు అనుమతి ఇచ్చారు.

షూటింగ సమయంలో కేవలం 12 మంది మాత్రమే ఉండాలనీ, ఎక్కువ మంది ఒక చోట గుమిగూడరాదనీ  పేర్కొన్నారు.

అలాగే  ఔట్ డోర్ షూటింగ్ లకు అనుమతి లేదు.

కరోనా కేసులు లేని ప్రాంతాల్లో మాత్రమే సీరియల్స్ షూటింగులు చేయాలి. షూటింగ్ సమయంలో మాస్కులు, శానిటైజర్లు  విరివిగా   వాడాలి.

ఈ నిబంధనలు  కచ్చితంగా పాటిస్తూ టెలివిజన్ షూటింగ్ జరుపుకోవాలని యడియూరప్ప అనుమతి ఇచ్చారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/