భారత ఆర్థిక వ్యవస్థ బలంగా కోలుకుంటుంది..నిర్మలా

YouTube video
Press Conference by Union Finance Minister Nirmala Sitharaman

న్యూఢిలీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడూ.. ప్ర‌భుత్వం ఇస్తున్న ఉద్దీప‌న ప్యాకేజీల‌కు సంబంధించి ఆమె ప్ర‌క‌ట‌న చేశారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిరంగా, బ‌లంగా కోలుకుంటోంద‌న్నారు. మూడ‌వ త్రైమాసికంలో వృద్ధి బ‌లంగా ఉంటుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు. అక్టోబ‌ర్‌లో పీఎంఐ 58.9గా ఉంద‌న్నారు. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్ష‌ల నుంచి 4.9 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ద‌న్నారు. క‌రోనా మ‌ర‌ణాల రేటు 1.47 శాతానికి ప‌డిపోయింద‌న్నారు. క్ర‌మంగా జీఎస్టీ వ‌సూళ్లు పెరుగుతున్నాయ‌ని, అక్టోబ‌ర్‌లో జీఎస్టీ వ‌సూళ్లు ల‌క్ష కోట్లు దాటిన‌ట్లు చెప్పారు. క్ర‌మంగా జీఎస్టీ వ‌సూళ్లు పెరుగుతున్నాయ‌ని, అక్టోబ‌ర్‌లో జీఎస్టీ వ‌సూళ్లు ల‌క్ష కోట్లు దాటిన‌ట్లు చెప్పారు. సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి రేష‌న్ కార్డుల‌కు పోర్ట‌బులిటీ క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ చెప్పారు. ఇంట‌ర్ స్టేట్ పోర్ట‌బులిటీ వ‌ల్ల సుమారు 68.6 కోట్ల మంది రేష‌న్ కార్డుదారుల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. 28 రాష్ట్రాల్లో ఎఫ్‌పీఎస్ సౌల‌భ్యం అమ‌లులో ఉన్న‌ట్లు చెప్పారు. రేష‌న్ కార్డు పోర్ట‌బులిటీ ద్వారా 1.5 కోట్ల లావాదేవీలు జ‌రుగుతున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 28 రాష్ట్రాల్లో వ‌న్ నేష‌న్‌, వ‌న్ రేష‌న్ కార్డు విధానం అమ‌లులో ఉంద‌న్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/