హైదరాబాద్ నగరవాసులకు షాకింగ్ న్యూస్..ఈరోజు 34 MMTS రైళ్లు రద్దు

హైదరాబాద్ నగరవాసులకు షాకింగ్ న్యూస్ తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఈరోజు 34 MMTS రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల 34 ఎంఎంటీఎస్ సర్వీసులను నిలిపివేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. లింగంపల్లి – సికింద్రాబాద్, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్‌లో ఒక్కో సర్వీసు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. కాగా, సెలవు రోజు వస్తే చాలు ఏదో ఒక కారణం చెప్పి ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.