సైదాబాద్ లో మరో దారుణం : 22 రోజుల శిశువును పొట్టనపెట్టుకున్నారు

సైదాబాద్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల శిశువు ఫై రాజు అనే యువకుడు అత్యాచారం చేసి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురించి ఇంకా ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరోదారుణం సైదాబాద్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో 22 రోజుల బిడ్డను పొట్టనపెట్టుకున్నారు తల్లిదండ్రులు.

సైదాబాద్ పూసల బస్తీ లో నివాసం ఉండే పొదిల రాజు, జాహ్నవి దంపతులకు 22రోజుల శిశువు ఉంది. అయితే గత రాత్రి భార్యా భర్తలు కలిసి మద్యం సేవించారు. అనంతరం వీరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రాజు తన భార్య జాహ్నవి ప్లాస్టిక్ పైపు తో కొడుతుండగా.. ఆమె తన ఒడిలో ఉన్న శిశువును అడ్డుపెట్టింది. అంతే కాకుండా భర్త కొడుతున్న సమయం లో బిడ్డను గట్టిగా పట్టుకునే సరికి ఊపిరి ఆడక శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. దాంతో స్థానికులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా శిశువు చికిత్స పొందుతూ మరణించింది. రెండేళ్ల క్రితం కూడా వీరికి ఓ బాబు పుట్టాడు. ఐదు నెలల వయసు ఉన్నప్పుడు..మద్యం మత్తులో ఆ బాబు ను భయటకు విసిరారు. దీంతో ఆ బాబు సంరక్షణ కోసం యూసుఫ్ గూడ శిశు విహార్ లో ఉంచారు. ఇక ఇప్పుడు మరో బిడ్డను పొట్టనపెట్టుకున్నారు.