జగ్గారెడ్డి ఫై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై సంగారెడ్డి ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కాకముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యేని అయ్యానంటూ మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీనా..? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అంటూ ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు.

ఈ తరుణంలో జగ్గారెడ్డి ఫై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో జరుగనున్న పొలిటికల్ ఎపైర్స్ కమిటి సమావేశంలో సీరియస్ గా చర్చించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు చెప్పారు మాణిక్యం. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు తో వివరాలు తెప్పించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మాణిక్యం హైదరాబాద్ కు రానున్నారు. ఈ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశంలో జగ్గారెడ్డి ఫై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.