వాల్తేర్ వీరయ్యలో తన రోల్ ఏంటో తెలిపిన రవితేజ

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న మాస్ రాజా రవితేజ…హీరోగానే కాకుండా ప్రత్యేక రోల్స్ లలో కూడా నటిస్తూ అలరిస్తుంటాడు. ప్రస్తుతం ఈయన హీరోగా ధమాకా మూవీలో నటించాడు. ఈ మూవీ రేపు గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న రవితేజ సినిమా విశేషాలతో పాటు వాల్తేర్ వీరయ్య మూవీ లో చేస్తున్న ప్రత్యేక రోల్ గురించి తెలిపాడు.

మెగాస్టార్ చిరంజీవి – శృతి హాసన్ జంటగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న వాల్తేర్ వీరయ్య మూవీ..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ లో విక్రమ్ సాగర్ ఏసీపీ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. రవితేజ తో గతంలో పవర్ వంటి పవర్ ఫుల్ సక్సెస్ ను ఇచ్చిన బాబీ మరోసారి రవితేజను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

కాగా ధమాకా మూవీ లో రవితేజ పాత్ర గురించి మీడియా ప్రతినిధులు అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా… వాల్తేరు వీరయ్య మూవీ నాకు చాలా స్పెషల్. చాలా ఏళ్ళ తర్వాత అన్నయ్య చిరంజీవితో నటించాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి మూవీ చేయడం గొప్ప అనుభవం. కథ, కథనాలు చక్కగా కుదిరాయి. వాల్తేరు వీరయ్య మూవీలో నా పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. రేపు సంక్రాంతికి థియేటర్స్ లో చూసి నచ్చిందో లేదో మీరు చెప్పాలి, అని చెప్పుకొచ్చారు. రవితేజ మాటలతో వాల్తేరు వీరయ్య చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి.