ఓటమి చవిచూసిన కోహ్లీ సేన ..
చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ఐపీఎల్ లో బెంగళూరుకు తొలి ఓటమి చవిచూసింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యంతో బాటింగ్ కు దిగిన బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే సాధించింది. . దీంతో చెన్నై 69 పరుగులతేడాతో విజయం జమ చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన తొ లి నుంచి నుంచి వికెట్లు కోల్పోయింది. దేవ్‌దత్ పడిక్కల్(34), మాక్స్‌వెల్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లు జడేజా 3, ఇమ్రాన్ తాహిర్ 2, సామ్‌కరన్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/