బెంగాల్ చీర కట్టులో అదుర్స్ !

‘శ్యామ్‌సింగ‌రాయ్`లో సాయి పల్లవి ఫస్ట్ లుక్ విడుదల

Sai pallavi’s first look in Shyam Singha Roy

కోల్ కతా నేప‌థ్యంలో రూపొందుతోన్న నేచుర‌ల్‌స్టార్ నాని `శ్యామ్‌సింగ‌రాయ్` ఇటీవ‌లి కాలంలో ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ నాని, ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ మ‌రియు నిర్మాత వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్‌. మే9 సాయిప‌ల్ల‌వి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘శ్యామ్‌సింగ‌రాయ్’ చిత్రం నుండి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ని మేక‌ర్స్‌ విడుద‌ల‌ చేశారు. సాంప్ర‌దాయ‌మైన బెంగాళ్ చీర‌క‌ట్టులో త్రిశూలం పట్టుకొని సాయి పల్లవి పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ చిత్రం ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో 10 ఎక‌రాల స్థ‌లంలో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నిర్మించిన భారీసెట్లో కీల‌క‌మైన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని
ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి రూపొందిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/