వైద్య శాఖలో 50వేల తాత్కాలిక పోస్టుల భర్తీ

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం

TS CM KCR
TS CM KCR
  • కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్‌లో సమీక్ష
  • కరోనా రోగులకు సేవలు అందించేందుకు తాత్కాలిక పద్దతిన పోస్టుల భర్తీ
  • ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్ధంగా ఉన్న వైద్యులు అర్హులు
  • ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు
  • భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులు

Hyderabad: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా రోగులకు సేవలు అందించేందుకు తాత్కాలిక పద్దతిన పని చేసేందుకు మొత్తం 50వేల మందిని ఉద్యోగాల్లో నియమించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .

https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం తెలిపారు.

రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. వీరికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని సూచించారు.వీరికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులను కలపాలని ఆదేశించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/