కొత్త సినిమాల ఫై సాయిపల్లవి క్లారిటీ

ఫిదా బ్యూటీ సాయి పల్లవి కొత్త సినిమాల ఫై క్లారిటీ ఇచ్చింది. ప్రేమమ్ , ఫిదా , మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాలతో ఆకట్టుకున్న సాయి పల్లవి..కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లో ఎందుకు వెనుకడుగేస్తుంది. నిన్న , మొన్న వచ్చిన హీరోయిన్స్ వరుస సినిమాలతో బిజీ గా ఉంటె..సాయి మాత్రం సైలెంట్ గా ఉండడం తో అభిమానులు నిరాశలో ఉన్నారు.

ఈ క్రమంలో సాయి పల్లవి కొత్త సినిమాల ఫై క్లారిటీ ఇచ్చింది. గత ఏడాది కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నది సాయిపల్లవి. తెలుగులో గ్యాప్‌ రాలేదని, తానే తీసుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది . ప్రస్తుతం ఆమె శివ కార్తికేయన్‌ సరసన ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది.