10 రోజుల్లోనే రేషన్‌ కార్డులు 90 రోజుల్లో ఇళ్లపట్టాలు

పాలనలో నూతన ఒరవడికి శ్రీకారం: ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఎపి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని సిఎం జగన్మోహనరెడ్డి అన్నారు.

మంగళవారం ఆయన ‘స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

గ్రామ, సచివాలయాల్లో నిర్ధిషమైన కాలపరిమితతో ప్రభుత్వ సేవలను అందించనున్నట్టు తెలిపారు. ఇళ్లపట్టాలు, రేషన్‌కార్డులు అర్హులందరికీ ఇవస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో అవినీతి లేని వ్యవస్థను తీసుకొచ్చామన్నారు.. 30లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని ఆయన వెల్లడించారు..

10రోజుల్లోనే రేషన్‌ కార్డులు. 90రోజుల్లో ఇళ్లపట్టాలను అందజేయనున్నట్టు తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/