దిగ్గజ వ్యాపారవేత్త జిమ్మీ లై అరెస్టు
భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు

హాంగ్ కాంగ్: హాంగ్ కాంగ్ దిగ్గజ వ్యాపారవేత్త, మీడియా టైకూన్ జిమ్మీ లైను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. విదేశీ శక్తులతో అతను జతకట్టాడన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. జూన్ నెలలో చైనా వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. భద్రతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ హాంగ్‌కాంగ్‌లో జరిగిన అల్లర్లకు జిమ్మీ లై మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. 71 ఏళ్ల జిమ్మీకి బ్రిటన్‌లోనూ పౌరసత్వం ఉన్నది. నెక్ట్స్ డిజిటల్ మీడియా జిమ్మీదే. ఆ కంపెనీలోకి కూడా హాంగ్ కాంగ్ పోలీసులు ఎంటర్ అయినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. జిమ్మీ ఆఫీసులను సెర్చ్ చేశారు. జిమ్మీ లే ఆస్తి సుమారు వంద కోట్ల డాలర్లు ఉంటుంది. తొలుత అతను వస్త్ర వ్యాపారం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మీడియా రంగంలోకి ఎంటర్ అయ్యారు. యాపిల్ డైలీ అనే పత్రికను స్టార్ట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/