బ్రిక్స్ సదస్సు.. దక్షిణాఫ్రికాకు బయల్దేరిన ప్రధాన మోడీ

Prime Minister Modi left for South Africa

న్యూఢిల్లీః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. ఢీల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరారు. జొహన్నెస్బర్గ్కు చేరుకోనున్న మోడీ.. అక్కడ జరిగే 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆహ్వానం మేరకు ఆగస్టు రెండ్రోజుల పాటు ఆ దేశంలో మోడీ పర్యటించనున్నారు.

సాధారణంగా ప్రతి విదేశీ పర్యటనకు ముందు ఆ టూర్ కు సంబంధించి ట్వీట్ చేయడం మోడీకి అలవాటు. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికా టూర్ గురించి కూడా మోడీ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో.. బ్రిక్స్ సదస్సుతో పాటు.. బ్రిక్స్-ఆఫ్రికా అవుట్రీచ్ కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు. గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తామని చెప్పారు. వైవిధ్యమైన రంగాల్లో సంబంధాల బలోపేతానికి బ్రిక్స్ కృషి చేస్తోందని.. ఈ సదస్సుకు హాజరయ్యే నేతల్లోని ‘కొంతమంది’తో తాను సమావేశమవుతానని మోడీ వెల్లడించారు.