మరింత తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

కరోనా ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు వాణిజ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది

petrol diesel rates becomes cheaper as crude oil hits
petrol diesel rates becomes cheaper as crude oil hits

హైదరాబాద్‌: చైనాలో కరోనా వైరస్‌ దెబ్బతో అంతర్జాతీయ చమురు వాణిజ్యం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం అవుతున్నాయి. ఎంతలా అంటే.. ఈ రోజు ధర గత 13 నెలల్లోనే కనిష్ఠం. ఈ ఏడాది కాలంలో ఎప్పుడూ తగ్గనంత తక్కువకు ధరలు పడిపోయాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చమురు ధరలు రూ.4 మేర తగ్గాయి. ఈ రోజు హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.76.47గా ఉంది. డీజిల్ ధర రూ.70.37గా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.71.96, ముంబైలో రూ.77.62, చెన్నైలో రూ. 74.75, బెంగళూరులో రూ. 74.41గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/