నగరంలో రూ. 2 కోట్ల ఫేక్ కరెన్సీ పట్టివేత!

ఫేక్ కరెన్సీని అఫ్జల్ గంజ్ లో కొనుగోలు చేసిన సుదర్శన్ అనే వ్యక్తి

హైద్రాబాద్ : హైదరాబాదులో నకిలీ నోట్లు పెద్ద ఎత్తున చెలామణి అవుతున్నాయి. తాజాగా నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 2 కోట్ల ఫేక్ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే నకిలీ కరెన్సీకి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద రూ. 2 కోట్ల ఫేక్ కరెన్సీ దొరికింది. రూ. 2 వేలు, రూ. 5 వందల కరెన్సీ నోట్లు వారి వద్ద ఉన్న సంచుల్లో లభించాయి.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ… ఈ నోట్లతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. లంగర్ హౌస్ కు చెందిన లక్ష్మి అనే మహిళను వీరు నకిలీ నోట్లతో మోసం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆమెకు అప్పుగా నకిలీ కరెన్సీని ఇచ్చేందుకు సుదర్శన్ అనే వ్యక్తి ప్లాన్ చేశాడని తెలిపారు. ఈ నోట్లను అఫ్జల్ గంజ్ లో సుదర్శన్ కొనుగోలు చేశాడని చెప్పారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/