RRR షూటింగ్ పూర్తి..ఇక మిగిలింది చిన్న ప్యాచీలే ..

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం). ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి అనేక అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. హీరోలకు గాయాలు కావడం..హాలీవుడ్ హీరోయిన్ మధ్యలో వెళ్లిపోవడం..రెండు కరోనా సీజన్ లు రావడం ఇలా ఈ సినిమా షూటింగ్ కు అన్ని బ్రేకులే పడ్డాయి. ఇలా ఎన్ని బ్రేకులు పడ్డ ఏమాత్రం నిరాశ పడకుండా రాజమౌళి అండ్ టీం షూటింగ్ ను పూర్తీ చేసారు.

చిన్న చిత‌కా ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా మొత్తం షూటింగ్‌ను పూర్తి చేశాం, మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌నుతెలియ‌జేస్తాం’’ అంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సినిమాలో ఫైన‌ల్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌కు ఉక్రెయిన్‌కు వెళ్లిన యూనిట్ పాట‌ను పూర్తి చేసుకోగానే ఈ అప్‌డేట్‌ను తెలియపరిచారు.

స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కె. వి. విజయేంద్ర ప్రసాద్ అసలు కథను ఇవ్వగా, రాజమౌలి ఈ చిత్రానికి స్క్రిప్ట్ ఇచ్చారు. అలాగే ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. కె.కె.సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ, అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్ .. కాస్ట్యూమ్ డిజైనింగ్ రామ రాజమౌళి చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంతో అజయ్ దేవ్గన్, అలియా భట్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు.

And thats a wrap! 🤟🏻
Except a couple of pickup shots, we are officially done with the entire shoot of #RRRMovie. Incidentally finished with the same bike shot that we started with on November 19th 2018. pic.twitter.com/lfXErpTbSS— RRR Movie (@RRRMovie) August 26, 2021