భార్య-భర్త మధ్య బలవంతపు శృంగారం నేరం కాదు : ఛత్తీస్‌గఢ్ కోర్టు

సంబంధిత కేసులో స‌ద‌రు భ‌ర్త‌కు విముక్తి

Forced sex between husband and wife is not a crime: Chhattisgarh court

భార్య-భర్త మధ్య బలవంతపు శృంగారం నేరం కాదని ఛత్తీస్‌గఢ్ కోర్టు పేర్కొంది. చట్టపరంగా ఏ ఇద్దరూ ఒక్కటైనా వారిమధ్య శృంగారం నేరం కాదని . అలాగే ఒక‌వేళ బ‌ల‌వంతంగా సెక్స్ జ‌రిగినా అది రేప్ కాదు అని ఇవాళ ఓ తీర్పులో పేర్కొంది. దీనికి సంబంధిన కేసులో స‌ద‌రు భ‌ర్త‌కు విముక్తి క‌ల్పించింది . ‘భార్య కోరిక‌కు విరుద్ధంగా భ‌ర్త శృంగారం చేసినా త‌ప్పు కాదు’ అని కోర్టు తెలిపింది. అయితే భార్య వ‌య‌సు 18 ఏళ్ల లోపు కాకుంటే, అప్పుడు భ‌ర్త‌తో జ‌రిగిన బ‌ల‌వంతపు శృంగారం అత్యాచారం కాదు అని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్ప‌ష్టం చేసింది. కాగా , ఇటీవ‌ల ముంబైలోనూ ఇలాంటి కేసు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఆ కేసులో ముంబై అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి తీర్పునిస్తూ.. భార్య‌తో భ‌ర్త బ‌ల‌వంత‌పు శృంగారం చేయ‌డం నేరం కాద‌ని పేర్కొన్నారు. ఆ కేసును ఇవాళ చ‌త్తీస్‌ఘ‌డ్ కోర్టు ప్ర‌స్తావించింది కూడా.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/